సుభద్ర (an auspicious woman)
సుభద్ర....... కృష్ణ వర్ణ ప్రకటన , మెరిసే నక్షత్రం లాంటి కళ్ళు, విరిసిన పువ్వులోని మకరందం, వెన్నెల వంటి చల్లదనం, జానకి దేవి సంస్కారం, భూదేవి సహనం.... అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతున్నాయి అనుకునే సమయం లో కంటికి కనబడని భయం, ఆవేదన,బాధ, కూతురి పై బెంగ అన్ని సుభద్ర నాన్న గారి కళ్ళలో చూసింది. ఆయనకు కూతురి పై ఉన్న ఆకాశమంత ప్రేమ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీ లో చేర్పించడానికి అడ్డోస్తుందేమో, ఏం ఏం సాకులు వెతికి ఆయనని ఒప్పించాలో అనుకుంది. నచ్చిన చదువు చదవాలన్న కల గాయపడిన కోయల కంఠంలో సమాధి అయిన రాగం ల సమధైపోయింది .కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు పద్మార్పిత అని తెలుసుకుంది . సుభద్ర కాలం పరుగుతీయ సాగింది.చివరికి ఇంజనీరింగ్ చేయడానికి సిద్ధపడింది.తెలిసినా కూడా వాదనకి మౌనమేగ లేపణమని , పెదవుల నడుమ ఆవేశాన్ని అణచివేసి ముందుకు సాగాలని , ఇష్టానికి గౌరవానికి జరిగిన పొరటయత్నంలో మారిపోయింది దిశ... తాను వెళ్ళే దిశలో ఎన్ని ముల్లోచ్చిన, అడంకులోచ్చిన ,ఎంతమంది క్రీనేడలు అడుగడుగునా ఉన్నా,నిలకడగా ఉండాలని కొత్తగా నడక నేర్చ సాగింది. మలుపు కనబడని,మునుపు తెలియని చోటికి చేరింది తెలిసి తెలియక .ఎన్న