సుభద్ర (an auspicious woman)

సుభద్ర.......
కృష్ణ వర్ణ ప్రకటన ,
మెరిసే నక్షత్రం లాంటి కళ్ళు,
విరిసిన పువ్వులోని మకరందం,
వెన్నెల వంటి చల్లదనం,
జానకి దేవి సంస్కారం,
భూదేవి సహనం....


అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతున్నాయి అనుకునే సమయం లో
కంటికి కనబడని భయం, ఆవేదన,బాధ, కూతురి పై బెంగ అన్ని సుభద్ర నాన్న గారి కళ్ళలో చూసింది. ఆయనకు కూతురి పై ఉన్న ఆకాశమంత ప్రేమ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీ లో చేర్పించడానికి అడ్డోస్తుందేమో, ఏం ఏం సాకులు వెతికి ఆయనని ఒప్పించాలో అనుకుంది. నచ్చిన చదువు చదవాలన్న కల గాయపడిన కోయల కంఠంలో సమాధి అయిన రాగం ల సమధైపోయింది .కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు పద్మార్పిత అని తెలుసుకుంది .

సుభద్ర కాలం పరుగుతీయ సాగింది.చివరికి ఇంజనీరింగ్ చేయడానికి సిద్ధపడింది.తెలిసినా కూడా వాదనకి మౌనమేగ లేపణమని , పెదవుల నడుమ ఆవేశాన్ని అణచివేసి ముందుకు సాగాలని , ఇష్టానికి గౌరవానికి జరిగిన పొరటయత్నంలో మారిపోయింది దిశ...
తాను వెళ్ళే దిశలో ఎన్ని ముల్లోచ్చిన, అడంకులోచ్చిన ,ఎంతమంది క్రీనేడలు అడుగడుగునా ఉన్నా,నిలకడగా ఉండాలని కొత్తగా నడక నేర్చ సాగింది.

మలుపు కనబడని,మునుపు తెలియని చోటికి చేరింది తెలిసి తెలియక .ఎన్నడూ ఎరుగని ప్రపంచం, అందమైన భావనాల మధ్య తరగతులు ,కొత్త కాలేజీ,కొత్త మనుషులు.మునుపు కనుగొనని ఆనందమేదో కలిగింది , ఉప్పొంగే ఊహాల్లో మునిగి తేలుతూ , మనసుకి రెక్కలొచ్చి  ఆకాశం లో తేలిపోతునట్లు అనిపించింది సుభద్రకి. లోకం మొత్తం తనదే అంటూ జీవం పోసుకొని తనని తాను కొత్త ప్రపంచానికి పరిచయం చేసుకోసాగింది.

సుభద్ర లో గుర్తుపట్టలేని మార్పు... సల్వార్ నుండి జీన్స్ ప్యాంటు వరకు,బాగున్నారా నుండి హెల్లో హై వరకు, ముద్దపప్పు ఆవకాయ నుండి పిజ్జా బర్గర్ల వరకు.కానీ ఆ మారు మంచిదేనా అని ఎన్నడూ ఆలోచించలేదు ఆ పసి ప్రాయం .

ఆ చిన్న వరద తాను నిర్ణయిచుకున్న దిశను మార్చేస్తుంది  , కలుసుకున్నంత కలిసిపోవదని,ఆ పరిచయాలు అతి సులువుగా అనిపించిన అవి తన అడుగు తడబడేల చేస్తాయని అలా తడబడిన అడుగు తండ్రి కుతుర్ల మధ్య మౌనాన్ని పెంచుతుందన్న ఆలోచన రానే రాలేదు సుభద్ర కి .

గుడ్డు లోంచి బయటికి వచ్చిన తాబేలు ఎదురుగా తల్లి లేకపోయినా అడుగులు నేర్చినట్లు , సుభద్రా చెంత తన తల్లి లేకపోయినా ఆమె చెప్పే మంచి చెడ్డలు తన గుండెల్లో అలజడి రేపాయి ఏమైనో అని . ఆ అలజడేనేమో తన అడుగు ఎటు సాగిన తన దిశలోనే అన్న ఆలోచనని బలంగా నాటుకుపోయేలా చేసింది 

మరి సుభద్రా ఆలోచనలకి అలుపోస్తే ?తాను రుతులాగ కలిసిపోవడం నేర్చుకుంటే ?


Comments

Popular posts from this blog

seeing like a feminist

Science,a double edged sword